Entertainment
Trending

ఈ వారం ఓటిటి ప్రేక్షకులకు – 4 సినిమాలు

ఈ వారం ఓటిటి ప్రేక్షకులకు 4 సినిమాలు ఇటీవల కాలంలో ఓటిటి లకు ఆధరణ పెరిగింది. ప్రేక్షకులు ఓటిటి లో సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే థియేటర్స్ లో రిలీజ్ అయిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఓటిటి లో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం చేసుకుంటే…విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం2 నవంబర్ 25 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలకానుంది.ఈ సినిమాలో మీనా హీరోయిన్ గా నటిస్తుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. అలాగే దేవకట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన రిపబ్లిక్ చిత్రం కూడా ఓటిటి లో రిలీజ్ కాబోతుంది. నవంబర్ 26 నుంచి జీ 5 లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

అలాగే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా నటించిన రొమాంటిక్ చిత్రం నవంబర్ 26 న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమాకు పూరి జగన్నాథ్ కథ స్క్రీన్ ప్లే అందించగా అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. వీటితో పాటు రజినీకాంత్ నటించిన పెద్దన్న సన్ నెక్స్ట్ , నెట్ఫ్లిక్ లో తమిళ్, తెలుగు వెర్షన్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button