Entertainment
Trending

దేవుడి పాత్ర‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

 దేవుడి పాత్ర‌లో క‌నిపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు అనే వార్త అల్లు అర్జున్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దేవుడి పాత్రలో నటించాలి అంటే చాలా గట్స్ ఉండాలి. కొందరు దేవుడి పాత్రలో నటించేందుకు అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కడ ప్రేక్షకులతో విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందో అని భయపడుతుంటారు. సినిమాల్లో దేవుడిగా నటించి మెప్పించిన వారిలో ముఖ్యంగా నందమూరి తారకరామారావు ముందు ఉంటారు. ఈ తరంలో పవన్ కళ్యాణ్‌, సుమన్, బాలకృష్ణతో పాటు పలువురు స్టార్స్ దేవుడి పాత్రలు చేసి మెప్పించారు

టాలీవుడ్ స్టార్ హీరోగా ఇండ‌స్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్.. రుద్ర‌మ‌దేవి చిత్రంలో అతిథి పాత్ర పోషించి ఆక‌ట్టుకున్నారు.

2020లో విడుదలైన తమిళ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఓ మై కడవులే మంచి విజయాన్ని అందుకుంది. అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా నటించిన ఈ మూవీలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశారు విజయ్ సేతుపతి

రుద్ర‌మ‌దేవి చిత్రంలో అతిథి పాత్ర పోషించి ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడు ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్‌లోనే అల్లు అర్జున్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్‌. త‌మిళ వ‌ర్షెన్‌లో విజయ్ సేతుప‌తి దేవుడి పాత్రను చేయ‌గా, ఇప్పుడు తెలుగులో బ‌న్నీ చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.అశోక్‌ సెల్వన్ పాత్రను తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను చేస్తోన్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విలన్’గా ప్రముఖ మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జంటగా రష్మిక మందన చేస్తోంది. పుష్ప క్రిస్మస్ సందర్భంగా తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో విడుదలచేయనున్నారు

విశ్వక్ సేన్ ‘అక్టోబర్ 31 – లేడీస్ నైట్’ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను ‘తలైవి’ సినిమా దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రస్తుతం విశ్వక్ పాగల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను నరేష్ కుప్పిల్లి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. రధాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచింది. హీరోయిన్‌గా సిమ్రాన్ చౌదరి నటిస్తోంది. ఈ సినిమా అలా ఉండగానే విశ్వక్ సేపన్ హీరోగా ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ అనే సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా బీవీ ఎస్ ఎన్ ప్రసాద్‌ సమర్పణలో భోగవల్లి బాపినీడు, ఇ. సుధీర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చింత విద్యాసాగర్‌ దర్శకత్వం వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button