Entertainment
Trending

RRR రిలీజ్ ఫిక్స్?

rrr release date

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ ఆర్.ఆర్ ఈ మూవీ విడుదల అక్టోబర్ 13న విడుదల కావలసి ఉంది. కరోనా మహమ్మారి రెండోదశ విజృంభణతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలతో కూడిన కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ఆ మేరకు షూటింగ్లూ నిలిచిపోయాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో త్రిపుల్ ఆర్ చిత్రం గురించి ఆసక్తికర విషయం తెలిసింది ఈ మూవీ 2022 ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. రాజమౌళి అతని చిత్ర బృందం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ప్రారంభం అవుతుందని సమాచారం. ఇంకా రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అల.. వైకుంఠపురములో ని విలన్ పాత్రధారి సముద్రఖని ఇతర నటీనటులు కీలక పాత్ర ల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రల తాలూకా ప్రోమో విడుదలై సంచలనం కలిగించిన విషయం విధితమే. ఆర్.ఆర్.మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తుండగా, మ్యూజిక్ ను ఎం.ఎం.కీరవాణి అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button