
ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తియింది ఈ సినిమా షూటింగ్‌ని 2018 నవంబర్ 19న బైక్ సీన్ షూట్‌తో ఆరంభించారు. సినిమా షూటింగ్ చివరి రోజు బైక్ సీన్‌తోనే గుమ్మడికాయ కొట్టారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయింది. ‘‘చిన్న ప్యాచ్‌వర్క్ మినహా సినిమా మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బైక్ సీన్‌తో సినిమా షూటింగ్ మొదలుపెట్టి, అదే సీన్‌తో ముగించడం అనుకోకుండా జరిగింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత.
Jr Ntr, Ram Charan leaving RRR movie set: ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ముగిసింది. సినిమాలో చివరి షాట్ ముగించుకున్న తారక్, చెర్రీ ఇద్దరూ సినిమా షూటింగ్ (RRR movie shooting) జరుగుతున్న లొకేషన్ సెట్స్ నుంచి తమ తమ కార్లలో వేగంగా వెళ్లిపోతున్న దృశ్యాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది