Entertainment
Trending

ఆర్‌ఆర్‌ఆర్‌: షాట్‌ గ్యాప్‌లో కెమెరామ్యాన్‌గా మారిన రాజమౌళి..

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఆగస్టు చివరి కల్లా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కానున్నట్లు సమాచారం. ఫైనల్‌ షెడ్యూల్‌ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఉక్రెయిన్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్‌ గ్యాప్‌లో జక్కన తన హీరోలతో కాస్త సరదా సమయం గడిపారు.

ఆలియా భట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మేకింగ్‌ వీడియాతో పాటు ఇటీవలె దోస్తీ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button