Entertainment
Trending

RAPO 19 Movie : హీరో రామ్ సినిమాలో నటి నదియా.. లుక్ రివీల్ పిక్

అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్త పాత్రలో నటించి మెప్పించారు నదియా. ఈ సీనియర్ నటి సెకండ్ ఇండింగ్స్ చాలా సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతుంది

అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్త పాత్రలో నటించి మెప్పించారు నదియా. ఈ సీనియర్ నటి సెకండ్ ఇండింగ్స్ చాలా సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతుంది. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. పవన్ సినిమా తర్వాత మిర్చి, దృశ్యం, బ్రూస్లీ ,అ ఆ, నా పేరు సూర్య, మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ‘గని’ ‘వరుడు కావలెను’ చిత్రాల్లో నటిస్తున్న నదియా. అలాగే ఇప్పుడు ఓ యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు నదియా. ఎనర్జిటికి స్టార్ రామ్ ప్రస్తుతం తమిళ్ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకురుస్తున్నారు.

ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెక్కుతుందని తెలుస్తుంది. ఇప్పటికే సెట్స్ లో రామ్ కు సంబంధించిన ఫోటోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ క్రమంలో దర్శకుడు లింగుస్వామి ఇన్స్టాగ్రామ్ వేదికగా సీనియర్ నటి నదియా లుక్ ని రివీల్ చేశారు. ఫొటోలో నదియా పసుపు చీరలో కళ్ళద్దాలు ధరించి హుందాగా కన్పిస్తోంది. అయితే ఈ సినిమాలో రామ్ తల్లి పాత్రలో నదియా నటిస్తుందని అంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ప్రస్తుతం హీరో రామ్ తో పాటుగా ఇతర ప్రధాన పాత్రలు పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button