EntertainmentTECHNOLOGY
Trending

Shankar – Thaman: రామ్ చరణ్ సినిమాకుమ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫైనల్

Shankar – Thaman: రాజమౌళి, శంకర్ (Rajamouli Shankar) సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడక్కూడదు. ఎందుకంటే అక్కడ కీరవాణి.. ఇక్కడ ఏఆర్ రెహమాన్ మారడంతే. ప్రతీ సినిమాకు వాళ్ళే ఉంటారు. కానీ 30 ఏళ్ళ తర్వాత మనసు మార్చుకున్నాడు శంకర్.

రాజమౌళి, శంకర్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడక్కూడదు. ఎందుకంటే అక్కడ కీరవాణి.. ఇక్కడ ఏఆర్ రెహమాన్ మారడంతే. ప్రతీ సినిమాకు వాళ్ళే ఉంటారు. అయితే ఇప్పుడు శంకర్ కూడా మనసు మార్చుకున్నాడు. రెహమాన్‌ను కాదని తన సినిమాకు మరో సంగీత దర్శకుడిని తీసుకుంటున్నాడు. దాదాపు 30 ఏళ్ళ తర్వాత శంకర్ సినిమా పోస్టర్‌పై మరో సంగీత దర్శకుడి పేరు కనిపించబోతుంది. అతడే థమన్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘RC15’ సినిమాకు థమన్‌ను తీసుకున్నారు. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసారు చిత్రయూనిట్. దాదాపు 100 కోట్లకు పైగానే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇది రామ్ చరణ్ 15వ చిత్రం. పాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ సినిమా రాబోతుంది. నిజాయితీ గల IAS ఆఫీసర్ రాజకీయాల్లోకి వెళితే ఎలాంటి మార్పులు తీసుకువస్తాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తుంది. ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందో.. ఇప్పుడు చరణ్ సినిమా కూడా అలాగే ఉంటుందని ప్రచారం జరుగుతుంది

ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత వరసగా చరణ్ చేస్తున్న రెండో పాన్ ఇండియన్ సినిమా ఇది. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తాడని ముందు నుంచి ప్రచారం జరిగినా కూడా తాజాగా థమన్ పేరును ఖరారు చేసారు.

అప్పట్లో శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ సినిమాలో థమన్ నటించాడు. ఇప్పుడు ఆయన సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు.కాగా, ఒకానొక సమయంలో యూత్ ఆడియన్స్‌ని ఆకర్షించి తనకంటూ ఫ్యాన్ బేస్ కూడగట్టుకున్న సిద్దార్థ్.. కొంత గ్యాప్ తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చాడు. ‘మహా సముద్రం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. Rx 100 ఫేమ్ అజయ్ భూపతి రూపొందిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మహా సముద్రం’ అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button