PROJECT K ప్రారంభం…


మహానటి సినిమాతో డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ కు మంచిమార్కులు పడ్డాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతోందన్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్, దీపిక పదుకొనే, అమితాబ్ ఇతర ప్రముఖులు నటిస్తున్నారు. ప్రభాస్, రాధేశ్యామ్ తో బిజిగా ఉన్నాడు. ఆపై ప్రశాంత్ నిల్ తో సలార్ మూవీ ఉంది. ఆలస్యమయ్యే అవకాశం ఉండగా, ఎట్టకేలకు ప్రాజెక్టు కే పేరుతో నాగ్ అశ్విన్ మూవీ గురుపూర్ణిమ రోజున పూజ చేసుకుంది. అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు. అసలే ఆయన బిజీ పర్సన్. అయితే రాబోయే 5 రోజుల్లో ఆయన తాలూకా సీన్స్ కొన్నింటినీ చిత్రీకరించనుందట నాగ్ అశ్విన్ టీం. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్ భాష ల్లో నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2022లో విడదలయ్యే అవకాశం ఉంది. గురుపౌర్ణిమ కావడంతో ఇండియన్ సినిమా గురువుగా అమితాబ్ ను పోల్చాడు ప్రభాస్.
