TECHNOLOGY
Trending

మలయాళం రీమేక్ మూవీ లో ప్రియప్రకాష్ వారియర్

మలయాళం రీమేక్ మూవీ లో ప్రియప్రకాష్ వారియర్ Priya Prakash Varrier ఒక్కసారి కన్నుకొట్టి కుర్రాలందరిని పడేసింది వింక్ గర్ల్ ప్రియప్రకాష్ వారియర్. ఒరు అధర్ లవ్  అనే సినిమాతో హీరోయిన్‌‌‌‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. యంగ్ హీరో నితిన్ నటించిన చెక్ సినిమాలో హీరోయిన్‌‌‌‌గా చేసింది ఈ చిన్నది. ఈ సినిమా ఆశించినంత ఫలితం సాదించనప్పటికీ ప్రియా యాక్టింగ్‌‌‌‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం మలయాళం తెలుగు భాషల్లో సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు తేజ సజ్జ హీరోగా నటిస్తోన్న ఇష్క్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఈ చిన్నది. ఈ సినిమా మీద చాలానే అంచనాలు ఉన్నాయి. అలాగే ప్రియా ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది.మలయాళంలో వచ్చిన ‘ఇష్క్’ మూవీ రీమేక్‌‌‌గా ఈ సినిమా తెరకెక్కింది. సాధారణంగా తాను సినిమాల్ని ఓకే చేయాలంటే.. కథ విన్నాక కాస్త ఆలోచించిన తర్వాత మాత్రమే ఓకే చేస్తానని చెబుతోంది ఈ చిన్నది. అయితే ఇష్క్ విషయంలో మాత్రం దర్శకుడు కథ చెప్పిన తర్వాత పెద్దగా ఆలోచించలేదని.. కేవలం రెండు రోజుల్లోనే తన నిర్ణయాన్ని చెప్పేసినట్లుగా చెప్తోంది. రోటీన్‌‌‌గా చూసే ప్రేమకథలా ఈ మూవీ ఉండదని.. ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందని.. యూత్ తమ జీవితాల్లో ఎదుర్కొనే కీలక సమస్యను ఈ సినిమా టచ్ చేస్తుందని చెప్పుకొచ్చింది ప్రియా ప్రకాష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button