Ponniyin Selvan -1: మణి రత్నం హిస్టారికల్ పాన్ ఇండియా మూవీ ’పొన్నియన్ సెల్వన్’ ఫస్ట్ పార్ట్ విడుదలకు ముహూర్తం ఖరారు..

Mani Ratnam – Ponniyin Selvan -1: సిల్వర్ స్క్రీన్‌ను కాన్వాస్ చేసుకుని పెయింటింగ్స్ గీసిన అతి కొద్ది మంది దర్శకుల్లో మణి రత్నం ఒకరు. తాజాగా ఈయన దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను వచ్చే యేడాది విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
Mani Ratnam – Ponniyin Selvan -1: సిల్వర్ స్క్రీన్‌ను కాన్వాస్ చేసుకుని పెయింటింగ్స్ గీసిన అతి కొద్ది మంది దర్శకుల్లో మణి రత్నం ఒకరు. అతేకాదు తన సినిమా అనే దృశ్య కావ్యాలతో మౌనరాగాలు ఆలపించి.. భారతీయుల గుండెల్లో రోజా పూలు పూయించారు. అంతేకాదు డైరెక్టర్‌గా భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం మణి రత్నం గత కొన్నేళ్లుగా తన స్థాయి తగ్గ సినిమాను తీయలేకపోయారు. ఈయన తీసిన చివరి సినిమా ‘నవాబు’ మాత్రం పర్వాలేదనిపించింది. తాజాగా ఈయన ప్రముఖ రచయత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే చారిత్రక నవలను తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్‌గా ఈ సినిమాను భారీ క్యాస్ట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మణి రత్నం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ‘PS-1’ లోగోతో పులి బొమ్మ ఉన్న ఆయుధాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను మణిరత్నం వడివడిగా చేస్తున్నారు. ఈచిత్రంలో అన్ని భాషలకు చెందిన అగ్ర నటీనటులు నటిస్తున్నట్టు సమాచారం. కానీ ఎవరు నటిస్తున్నరనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇందులో విక్రమ్, జయం రవి, కార్తి, మోహన్ బాబు, కీర్తి సురేష్, ఐశ్వర్యా రాయ్, త్రిష, వంటి నటీనటులు నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్.రవి వర్మన్ డైెరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. తోట తరణి ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేసారు. మొత్తంగా ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.