TECHNOLOGY
Trending

అయోధ్యలో అభివృద్ధి కదం తొక్కాలి: పీఎం మోడీ

అయోధ్యలో అభివృద్ధి నలువైపులా విస్తరించాలని పీఎం మోడీ ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో అయోధ్య ఆలయ నిర్మాణ పనులు మరియు ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిపై శనివారం రివ్యూ సమావేశం జరిగింది. పీఎం మోడీ తో జరిగిన ఈ సమావేశంలో ఆదిత్యనాథ్ ..అయోధ్యలో అభివృద్ధిరోడ్లు రైల్వే స్టేషన్ మరియు ఎయిర్పోర్టు చేపట్టవలసిన ఇతర అభివృద్ధి గురించి ఈ మీటింగ్ లో చర్చించినట్టు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రతి భారతీయుడికి కోసం ఈ నగరం అనుకునేలా అయోధ్య ఉండాలని మోడీ ఆదిత్యనాథ్ కు వివరించారు. ఇటీవల రామాలయం ట్రస్ట్ భూముల కొనుగోలు విషయంలో ఆరోపణల నేపథ్యంలో ప్రధాని మోడీ మరియు చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ మధ్య సమావేశం జరగడం చెప్పుకోదగిన అంశం. ఈ నెలలో ఈ తరహా సమావేశం జరగడం ఇది రెండోసారి. ఇటీవల రాజధాని ఢిల్లీలో pm మోడీ బిజెపి ప్రముఖ నేతలు మరియు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సమావేశం జరగడం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button