Entertainment
Trending

Narappa Success meet : వెంకటేష్ నటనకు ప్రశంసలు

విక్టరీ వెంకటేష్ ఎప్పుడూ కూడా తన సినిమాల గురించి గొప్పలు చెప్పుకోరు. తన నటన, తన సినిమాల ఫలితం గురించి అంతగా చెప్పుకోరు.విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో.. డైరెక్ట్రర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం నారప్ప. జూలై 2న అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది అయితే తన నారప్ప సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో కూడా దాని ఒరిజినల్ సినిమా గురించి మాట్లాడుతూ అక్కడి దర్శకుడు, హీరోల గురించి కామెంట్ చేశారు. ఈ క్రమంలో దటీజ్ వెంకీ అని అభిమానులు ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న జరిగిన ఈ సక్సెస్ మీట్‌లో వెంకటేష్ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

నారప్ప సినిమాలో ప్రియమణి, కార్తిక్ రత్నం కీలక పాత్రలలో నటించారు. తాజాగా ఈ నారప్ప చిత్రయూనిట్ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటుంది.థియేటర్లలో చూడాల్సిన ‘నారప్ప’ ఓటీటీలో వచ్చినందుకు ప్రేక్షకులకు బాధగా అనిపించినా.. మా పరిస్థితిని అర్థం చేసుకుని గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను అని వెంకటేష్‌ ఎమోషనల్ అయ్యారు. సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

2అసురన్ రీమేక్‏గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ నటనకు సర్వత్ర ప్రశంసలు అందుతున్నాయి. ఆయన చూపించిన వేరియేషన్స్‌‌ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా నారప్పలోని యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలిచాయి 5ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రలు చేశాను. కానీ, ఈ సినిమా, ఇందులో నా పాత్ర చాలా విభిన్నమైనది. నటుడిగా నాకెంతో సవాల్‌గా నిలిచింది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు వెట్రిమారన్‌, ధనుష్‌లకు థ్యాంక్స్‌. వాళ్లు ‘అసురన్‌’ చేయకపోతే.. ఈరోజు ఈ ‘నారప్ప’ లేదు. కచ్చితంగా ప్రేక్షకులందరికీ థియేటర్లో మరో మంచి సినిమా చూపిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నా. సంక్రాంతికి ‘ఎఫ్‌3’ సినిమాతో తప్పకుండా వినోదాలు అందిస్తానని అన్నారు. అంటే ఈ లెక్కన దృశ్యం 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతోన్నామని పరోక్షంగా చెప్పినట్టైంది. ఈ సక్సెస్ మీట్‌లో అనిల్‌ రావిపూడి, ప్రియమణి, కార్తిక్‌ రత్నం, రాఖీ, అనంత శ్రీరామ్‌, గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button