Entertainment
Trending

జగదీష్ రిలీజ్ అప్డేట్ ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ..అధికారిక ప్రకటన కూడా!

వీ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమాలో నటించారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూసివేత గురించి ముందే ఊహించిన సినిమా యూనిట్ సినిమాని వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం త్వరలో ప్రకటిస్తామని కూడా నాని వాయిదా ప్రకటనలో చెప్పుకొచ్చాడు. అయితే ఫిల్మ్ షూట్స్ తిరిగి ప్రారంభించడంతో విషయాలు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, ఇప్పటికీ థియేటర్స్ విషయంలో అనిశ్చితి కొనసాగుతుంది. ఈ అస్పష్టతతో, కొన్ని పెద్ద సినిమాలు OTT విడుదలకు వెళ్ళాయి. అయితే, నాని మాత్రం అలా చేయడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. కుర్ర హీరోలల్లో నాని మొదటి సాహసం చేస్తున్నాడని అంటున్నారు. తాజా సమాచారం మేరకు టక్ జగదీష్ థియేట్రికల్ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాని జూలై 30న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. యూనిట్ త్వరలో ప్రచార కార్యక్రమాలకు సన్నద్ధమవుతుంది మరియు ఈ విషయంలో త్వరలో ఒక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. ఇక నాని ఈ సినిమాతో పాటు శ్యామ్ సింగరాయ్ అనే సినిమా కూడా చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Back to top button