TECHNOLOGY
Trending

Cm జగన్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా వైద్య సిబ్బంది ఒక్కరోజులోనే 13 లక్షల 72 వేల మందికి వ్యాక్సిన్ వేయడం లో సీఎం జగన్ ప్రభుత్వ కృషి దాగి ఉందని చిరంజీవి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన జగన్ నాయకత్వాన్ని వైద్య సిబ్బంది పనితీరును కొనియాడారు. ఈనెల 20న రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన విషయం విదితమే. ఇదిలావుండగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బాధితులను ఆదుకోవడానికి తనవంతుగా తెలుగు రాష్ట్రాల్లో ని జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఉచితంగా సరఫరా చేస్తున్నారు . రాజకీయాలను వీడి సినిమా రంగం వైపు మరలా విచ్చేసి ఖైదీ నెంబర్ 150 మూవీతో హిట్ అందుకున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ లో నటిస్తున్నారు. త్వరలో ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button