Entertainment
Trending

సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ఫిక్స్ :

సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ఫిక్స్ :మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం 2022 జనవరి 13వ తేదీన విడుదల చేస్తున్నట్టు దర్శకుడు పరశురామ్ ప్రకటించారు. సర్కార్ వారి పాట చిత్రం పోస్టర్ లో రెడ్ కారు లోంచి మహేష్ దిగబోయే దృశ్యం ఆకట్టుకుంటుంది. మహేష్ హెయిర్ స్టైల్ లుక్ డిఫరెంట్ గా ఉంది. మహేష్బాబు కుడిచేతి పక్కన ఉన్న గ్లాస్ లో పరిశీలిస్తే ముగ్గురు ద్విచక్ర వాహనదారులు కనిపిస్తున్నారు ఇది ఫైట్ సీన్ తాలూకా సీన్ అయి ఉంటుందని సగటు అభిమాని భావిస్తున్నాడు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇంకేమైనా కొత్త విషయాలు తెలుస్తాయౌ లేదో వేచి చూడాల్సిందే. ఎందుకంటే మహేష్ సర్కారు వారి పాట చిత్రం తాలూకు ఫస్ట్ నోటీస్ అని డైరెక్టర్ సూచించి పోస్టర్ రిలీజ్ చేయగా, ఆయన బర్త్ డే రోజున రెండో నోటీస్ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. మ్యూజిక్ ను తమన్ అందిస్తున్నాడు. మహేష్ గురించి లేటెస్ట్ అప్ డేట్స్ రావడంపై ఘట్టమనేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button