Entertainment
Trending

నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది

నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ అప్డేట్ వచ్చేసిందిచైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ విడుదల తేది ఖరారు చేసారు. అంతేకాదు రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా చేసారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్‌కే మొగ్గు చూపారు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు థియేటర్స్‌లో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘లవ్ స్టోరీ’ సినిమాను సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

.‘లవ్ స్టోరీ’ సినిమా విషయానికొస్తే..  ఫిదా తర్వాత మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ షూటింగ్ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేసారు దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ సంచలన పాయింట్ చూపించబోతున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటి వరకు తెలుగులో ఏ దర్శకుడు చెప్పిన కథను ఇందులో చూపించబోతున్నట్టు సమాచారం. దానికి ప్రేమకథను జోడించి కథ తెరకెక్కించారు.  ప్రతీ అమ్మాయి తమ యవ్వన దశలో ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యను ఈ సినిమాలో చూపించబోతున్నాడు కమ్ముల. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు. ఈ సినిమాలోని సారంగదరియా పాట యూట్యూబ్‌లో 300 మిలియన్ (30 కోట్లు) మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపుతూనే ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button