Entertainment
Trending

Love Story Release Date: థియేటర్ లోనే లవ్ స్టోరీ రిలీజ్ ‘లవ్ స్టోరీ’ విడుదల తేది ఖరారు…

naga-chaitanya-sai-pallavi

నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ లాక్ డౌన్ వళ్ళ థియేటర్లు మూతపడటంతో పెద్ద సినిమాలన్నీ ఓటీటీ బాటపట్టిన విషయం తెలిసిందే. వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమా ఓటీటీ బాట పట్టడం, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ కూడా రావడంతో ఒకానొక దశలో పెద్ద సినిమాలు ఓటీటీ వారిని సంప్రదించి డీల్ కూడా కుదుర్చుకున్నాయని వార్తలు వెలువడ్డాయి. అలాంటి వాటిలో సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన ‘లవ్‌స్టోరీ’ కూడా అదే బాటలో పయనించింది. అయితే జూలై 30 నుండి థియేటర్లు తెరుచుకోవడం .. చిన్న సినిమాలు ధైర్యంగా ముందుకు వస్తుండటంతో  ‘లవ్ స్టోరీ’ సినిమా మేకర్స్ వినాయకచవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడంతో ఈ చిత్రం థియేటర్ ల లోనే విడుదల అవుతుందని కన్ఫర్మన్ అయ్యింది. మరి ఇదే తరహాలో విడుదలకి సిద్దంగా ఉన్న మిగతా పెద్ద సినిమాలు సైతం థియేటర్ లలోనే విడుదల అవుతాయా రిస్క్ ఎందుకు అనుకుని ఓటీటీ బాట పడుతాయా అన్నది చూడాల్సిందే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button