Entertainment
Trending

డార్లింగ్ ప్రభాస్‌ ను పెళ్లి చేసుకుంటా హీరోయిన్‌ కృతీ సనన్‌

తెలుగులో మహేష్ బాబు సరసన 1 – నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్‌ కృతీ సనన్‌. 1 – నేనొక్కడినే, దోచేయ్ తెలుగు సినిమాల్లో నటిచింది .డార్లింగ్ ప్రభాస్‌ ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది‘‘ప్రభాస్‌.. టైగర్‌ ష్రాఫ్‌.. కార్తీక్‌ ఆర్యన్‌’ ఈ ముగ్గురి హీరోల్లో మీరు ఎవరితో డేట్‌కు వెళతారు? ఎవర్ని వివాహం చేసుకుంటారు? ఎవర్నీ ఫ్లర్ట్‌æ చేస్తారు?’ అనే ప్రశ్నలకు కృతీ సనన్‌ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని, టైగర్‌ ష్రాఫ్‌తో డేటింగ్‌కు వెళతానని, కార్తీక్‌ ఆర్యన్‌ను ఫ్లర్ట్‌ చేస్తానని కృతీ సనన్‌ చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం ‘ఆదిపురుష్‌’ సినిమాలో ప్రభాస్, కృతీ సనన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలనుకుంటున్నారు.

కడపలో ‘రాధేశ్యామ్‌’
రాధేశ్యామ్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రూపొందిస్తున్న సినిమా. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కె. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కడపలో జరుగుతోంది. టైటిల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌ను తీస్తున్నారని తెలిసింది. ఈ సీన్స్‌లో నటుడు సత్యరాజ్‌ పాల్గొంటున్నట్లు తెలిసింది. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీ విషయంపై త్వరలో స్పష్టత రానుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button