Entertainment

Keerthy Suresh:దోపిడి దొంగ పాత్రలో మహానటి

అందాల భామ కీర్తి సురేష్ మహానటి సినిమా తో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు ఆ సినిమాతో కీర్తి సురేష్ కు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా లభించింది .ఈ అగ్రనాయక తెలుగు తమిళ భాషల్లో భారీ ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే మరోవైపు ప్రయోగాత్మక పాత్రల ద్వారా ప్రతిభను చాటుకుంటున్నారు

మహానటి సినిమాలో అద్భుత అభినయాన్ని కనబర్చి జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ అనేక సవాళ్లతో కూడుకున్న పాత్రలను ఎదుర్కునేందుకు ఎప్పుడూ రెడీగా నే ఉంటారు.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తమిళ చిత్రం saani kaayidham. ఈ సినిమాలో లో కీర్తి సురేష్ దోపిడి దొంగ పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఆమె ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఈ సినిమాలో కీర్తి నెగిటివ్ ఛాయ లో సాగే పాత్రలో కనిపిస్తారని అని తెలుస్తోంది అంతేకాకుండా ఈ క్యారెక్టర్ తన కెరియర్ లో గుర్తుండి పోతుందని చెబుతున్నారు ఈ అందాల భామ.ఇది ఇలా ఉంటే ఇటీవలె చెన్నైలో ఈ సినిమా షూటింగ్ నో పున ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాక్ టు షూటింగ్ లైఫ్ అంటూ కీర్తి సురేష్ ఇంస్టాగ్రామ్ లో లో ఓ పోస్ట్ చేశారు చాలాకాలం విరామం తర్వాత సెట్స్ పై అడుగు పెట్టడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

అరుణ్ మహేశ్వరన్-దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు తమిళనాడులో 1980 లో జరిగిన యథార్థ ఘటనలా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అన్యాయాలను ఎదిరించే క్రమంలో దోపిడీ దొంగలుగా మారిన ఇద్దరు వ్యక్తులు వారి జీవితం లోని అనేకా మలుపులతో సాగే క్రైమ్ డ్రామా ఈ సినిమాను రూపొందిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button