Entertainment
Trending

RRR Movie: హైదరాబాద్ చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్..

charan-ntr

RRR Movie: హైదరాబాద్ చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీకి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‏తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే దాదాపు పూర్తైన ఈ సినిమాలోని రెండు పాటలను చిత్రీకరించడానికి రామ్ చరణ్, ఎన్టీఆర్, చిత్రయూనిట్ ఉక్రెయిన్ వెల్లిన సంగతి తెలిసిందే. అక్కడి వీరిద్దరితో కలిసి తీసే పాటల చిత్రీకరణ పూర్తి కావడంతో బుధవారం రాత్రి ఆర్ఆర్ఆర్ బృందం తిరిగి హైదరాబాద్‏కు చేరుకుంది. వీరిద్దరు ఎయిర్ పోర్ట్‏లో నుంచి వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉక్రెయిన్ నుంచి నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టులో తారక్, చరణ్ నడిచివస్తున్న ఫోటోలను అక్కడున్న కొందరు తమ కెమెరాలో బంధించి నెట్టింట్ల అప్‏లోడ్ చేశారు.

అలాగే ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెలబ్రెషన్స్ జరుపుకున్న ఫోటోలు సైతం నెట్టింట్లో తెగ హల్‏చల్ చేశాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో శ్రియా శరణ్, అజయ్ దేవ్‏గన్‏లు కీలక పాత్రలలో నటించారు. ఇద్దరు స్టార్ హీరోలు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ సినిమాను చూసేందుకు తారక్, చరణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషన్ సాంగ్ దోస్తీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button