Entertainment
Trending

టాలీవుడ్ లో.. అల వైకుంఠపురములో.. మరి బాలీవుడ్ లో ఏం పేరు తెలుసా..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అలా వైకుంఠపురం లో 2020 లో సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం పేరు ను బాలీవుడ్లో ..షహజాదాగా.. మార్చారు. Kartik aaryan, కృతిసనన్ లీడ్ రోల్స్లో నటించనున్నారు. మరో ముఖ్య పాత్రలో పరేష్రావల్ కనిపించనున్నారు. టబు పాత్రలో మనీషా కొయిరాలా నటించనున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ మరియు ఏక్తా కపూర్ సంయుక్తంగా నిర్మించనున్నారు. దర్శకత్వ బాధ్యతలను రోహిత్ ధావన్ చూసుకోనున్నారు. టాలీవుడ్ లో ఆల్టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బాలీవుడ్లో ఆ స్థాయి విజయం అందుకుంటుందో లేదో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. మరి అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం ఇది. బుట్ట బొమ్మ, రాము లో రాము లో ..సాంగ్లు ఈ చిత్రానికి మంచి హైప్ ను తీసుకు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button