
పూజా హెగ్డే ఒక మూవీకి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…? టాలీవుడ్ తో పాటు ఇతర చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగుతున్న ది. పూజా హెగ్డే కెరీర్ను రంగస్థలం, అలా వైకుంఠపురం ల్లో చిత్రాలు మలుపు తిప్పాయి. ప్రస్తుతం తెలుగు లో ప్రభాస్ సరసన రాధేశ్యామ్ తో పాటు కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య , బాలీవుడ్ లో భాయిజాన్, తమిళ్ లో విజయ్ నటిస్తున్న బీస్ట్ వంటీ భారీ చిత్రాల్లో నటిస్తోంది ఈ అమ్మడు. తాజాగా ఈ అమ్మడు గురించి రూమర్స్ వినవస్తున్నాయి. ఈ బ్యూటీ తను నటించబోయే ఒక్కో సినిమాకు 3 కోట్లా 50 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల తమిళ్ సూపర్ స్టార్ విజయ్ రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం బయటికి రావడం తెలిసిందే. కెరియర్ టాప్ లో ఉండగా అనే నాలుగు రాళ్ళు వెనుకకు వేసుకోవాలి అన్న చందంగా హీరోయిన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సినీ పండితులు విశ్లేషిస్తున్నారు