Entertainment
Trending

RRR making video out…రాజమౌళి నెవ్వర్ బిఫోర్ మేకింగ్

పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ మూవీ RRR అసలు హంగామా మొదలైంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ విజువల్ వండర్ పై అంచనాలు ఇప్పటికే అకాశాన్ని దాటేశాయి. ఇక ఈ రోజు విడుదల చేసిన రోర్ ఆఫ్ RRR మేకింగ్ వీడియో కూడా అంచనాల డోస్ మరింత పెంచేసింది. రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ ను అందించింది.

నెవ్వర్ బిఫోర్ అనేలా.. నెవ్వర్ బిఫోర్ అనేలా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం బీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఊరిస్తోంది. కేవలం మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button