
Chatrapathi Remake Launch : బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు
.బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో రాగా.. ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమానికి రాజమౌళి గెస్ట్‌గా వచ్చారు. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 8:30కి జరుగనుంది. r
చత్రపతి హిందీ రీమేక్‌ను పెన్ స్డూడియోస్ నిర్మిస్తోంది. ఛత్రపతి ఒరిజినల్ వెర్షన్‌కి కధను అందించిన ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మరోసారి హిందీకి కథను సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్‌కి అనుకూలంగా ఉండటం కోసం సెకండాఫ్‌లో ఛత్రపతి హిందీ రీమేక్ కథను కొంత మారుస్తున్నారని టాక్. బెల్లంకొండ తమిళ్’ లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న కర్ణన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.