Entertainment
Trending

Prabhas -Project K : డార్లింగ్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ నుంచి మరో అప్‌డేట్..

Story Highlights
  • ఈ చిత్రాన్ని 2023 సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.
  • ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది
  • ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది.ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని

డార్లింగ్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో  తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్ K’(Project K) ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం కరోనా విజృంభనతో ఈ సినిమా షెడ్యూల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి ఈ సినిమాను ఎంత వీలైతే అంత త్వరగా సెప్టెంబర్ వరకు  ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని 2023 సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. అది బాహుబలి 2 విడుదల తేది అయిన ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం  ఈ  సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ఇక ఈ సినిమా గురించి మరో విషయం ఏమంటే.. ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాట్లు పూర్తి చేసారు

ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే..’రాధే శ్యామ్’ విషయానికొస్తే.. ఈ మూవీ సంక్రాంతి రేసు నుంచి  తప్పుకుంది. జనవరి 14న రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

ఇక ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది.ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి పిక్చరైజ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button