Entertainment
Trending

యాత్ర సీక్వెల్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో బాలీవుడ్ నటుడు

యాత్ర మూవీ గత ఎన్నికల ముందు రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడింది. వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రమిది. చిత్రం ముగింపులో వైయస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. తదుపరి ఆయన రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరుతూ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం చూపించారు. యాత్ర చిత్రాన్ని మహీ రాఘవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సీక్వల్ ఉంటుందని అప్పుడే ఆయన ప్రకటించారు. యాత్ర టు లో వైఎస్ను ఆదర్శంగా తీసుకొని ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఎలా వచ్చారు తండ్రి చనిపోయిన తర్వాత సీఎం కుర్చీ కోసం జరిగిన సంతకాల సేకరణ తదితరాలు ఈ చిత్రంలో చూపించబోతున్న ట్లు తెలిసింది. యాత్ర పాన్ ఇండియా సినిమా గా రూపొందుతున్నది. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదూ బాలీవుడ్ నటుడు ప్రతిక్ గాంధీ జగన్ మోహన్ రెడ్డి పాత్రల్లోకనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button