Entertainment
Trending

బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ కన్నుమూత

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ బుధవారం ఉదయం కన్ను మూశారు. కిడ్నీ, శ్వాసకోశ ఇతర అనారోగ్య సమస్యలతో ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. ఆయన పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించారు. 1994లో జ్వర భాతా మూవీతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆయన 65 సినిమాల్లో నటించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 1991లో పద్మభూషణ్, 1994లో దాదాసాహెబ్ ఫాల్కే , 2015 లో పద్మ విభూషణ్ అవార్డు లతో ప్రభుత్వం సత్కరించింది. దిలీప్ కుమార్ మృతి కి టాలీవుడ్ ప్రముఖులు మరియు చిరంజీవి వెంకటేష్ , జూనియర్ ఎన్టీఆర్, ఇతర సినీనటుడు తదితరులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలి పారు. హిందీ తమిళ్ కన్నడ మలయాళం ఇతర చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు సినీ తారలు కూడా సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button