TECHNOLOGY
Trending

అస్సాం మిజోరాం బోర్డర్ row … FIR లో Assam cm పేరు

అస్సాం మిజోరాం బోర్డర్ వద్ద ఇటీవల రెండు రాష్ట్రాల పోలీసుల కాల్పుల ఘటనలో పోలీసులు ఆరుగురు చనిపోవడం తెలిసిందే. ఈ కేసు ఎఫ్ఐఆర్లో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ మరియు పోలీసు ఉన్నతాధికారుల పేర్లను మిజోరం పోలీసు ఉన్నతాధికారులు చేర్చారు. ఎఫ్ఐఆర్లో ఇండియన్ పీనల్ కోడ్ లోని పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే అస్సాం బోర్డర్ అయినటువంటి కాచర్, మిజోరం జిల్లా కొలసిబ్ వైరంట్ పోలీస్ స్టేషన్ వద్ద హత్యా యత్నం చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అస్సాం పోలీసులు, సీఎం హేమంత్ శర్మ సూచనల మేరకు నడుచుకుంటున్నారని, చర్చలకు సుముఖత ను వ్యక్త పరచలేదని అందులో వివరించారు. ఇంకా ఈ నివేదికలో అస్సాం చీఫ్ మినిస్టర్ సూచనల మేరకు అక్కడి అస్సాం పోలీసులు, ఘటనా ప్రాంతం వద్ద క్యాంప్ కార్యాలయంను నిర్మించడానికి అవసరమైన టెంట్లు ఇతర సామగ్రి అంబులెన్స్ మరియు 20 వాహనాలతో చేరుకున్నారని , దీంతో బలవంతంగా మిజోరం బోర్డ్ ఆఫ్ పాయింటు ఆక్రమించుకోవాలనే వారి ఉద్దేశం కానవచ్చిందని తెలిపారు. ఎఫ్ఐఆర్లో చేర్చిన వీరందరూ ఆగస్టు 1న వైరంట్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోరారు. ఎఫ్ఐఆర్లో అస్సాంకు చెందిన ఆరుగురు ఉన్నతాధికారులకు ఘటన జరిగిన రోజు పంపించారు. అలాగే అస్సాం పోలీసులు కూడా మిజోరం ఉన్నతాధికారులకు మరియు మిజోరం రాజ్యసభ ఎంపీ కె వన్ లాల్వెన్ కు ఈ గొడవతో సంబంధాలున్నాయని సమన్లు పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button