TECHNOLOGY
Trending

రేపటినుండి గుంటూరులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

రేపటినుండి గుంటూరులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగనుంది ఈ నెల 30 వరకు కొన సాగే ఆర్మీ సెలక్షన్స్ కి దాదాపు 34 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియం హలో గురువారం నుండి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది ఈనెల 30 వరకు సాగే ఆర్మీ సెలక్షన్స్ కి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మేరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ఏర్పాట్లను అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆర్మీ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూల్ అనంతపురం జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం ఈ సెలక్షన్ ని ఏర్పాటు చేశారు ఏడు జిల్లాలకు చెందిన దాదాపు 34 వేల మంది అభ్యర్థులు రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరు అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఎస్పీ వెల్లడించారు ప్రతిరోజు రెండు వేల ఐదు మంది సెలక్షన్స్ కి వస్తారని ఆయన చెప్పారు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అభ్యర్థుల నుండి భారీ స్పందన ఉన్న నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు ఆర్మీ సెలక్షన్స్ సమయంలో లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని ఆరిఫ్ హఫీజ్ స్పష్టం చేశారు అదేవిధంగా వర్షాకాలం ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఆయన చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button