Entertainment
Trending

Anasuya Bharadwaj : పుష్ప’ సెట్స్‌ నుంచి రంగమ్మత్త ఫోటోలు లీక్‌

ఈ అందాల యాంకరమ్మ. టీవీలో సక్సస్ అయిన అనసూయ.. సినిమాల్లోనూ రాణిస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌గానే కాకుండా  లేడీ విలన్‌‌‌గానూ మెప్పిస్తుంది. అడవి శేష్ నటించిన ‘క్షణం’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఆ తర్వాత పలుసినిమాల్లో యాక్ట్ చేసింది. ‘ఎఫ్ 2’, ‘సోగ్గాడే చిన్నినాయనా’,’రంగస్థలం’, ‘మీకుమాత్రమే చెప్తా’, ‘థాంక్ యు బ్రదర్’ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది అనసూయ. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా అనసూయ కెరీర్‌‌‌‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. రంగమ్మత్త క్యారెక్టర్‌‌లో అనసూయ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ప్ర‌స్తుతం అన‌సూయ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండతో పాటు రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న కిలాడి సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తుంది. వీటితో పాటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో కూడా కీలకమైన పాత్రలో కనిపిస్తుంది అనసూయ. బాయ్‌కట్‌ హెయిర్‌ స్టైల్‌లో మాస్‌ లుక్‌లో కనిపిస్తున్న అనసూయ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అనసూయ లుక్‌పై కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఈమె అసలు అనసూయేనా అంటూ నెటిజన్లు క్రియేట్‌ చేసిన మీమ్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఈ పాత్రకి తక్కువ సీన్సే ఉన్నా చాలా ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టరట అనసూయది. ఆమె పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని ప్రచారం జరుగుతుంది. అనసూయ, సునీల్ పాత్రలు సినిమాకు కీలకంగా మారనున్నాయట. నిజానికి ముందు ఈ సినిమాలో అనసూయ పాత్ర లేదు కానీ రంగస్థలం లో రంగమ్మత్త క్యారెక్టర్ కి వచ్జిన హైప్ ని చూసి కావలనే ఈ మూవీలో తీస్కున్నాడట సుకుమార్ ఈ చిత్రంలో అనసూయ సునీల్‌కి భార్యగా కనిపించనుందని సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button