Entertainment
Trending

పుష్ప పార్ట్ 2 లో మార్పులు ఇవేనా?

pushpa latest updates

దర్శకుడు సుకుమార్ మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న పుష్ప చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. పుష్ప టు లో సినిమా పేరు విలన్ మార నున్నట్లు గాసిప్ వినిపిస్తుంది. పుష్ప పార్ట్ 2కు ఏ పేరు పెట్టబోతున్నారు, ఆ కొత్త విలన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. దీనిపై పుష్ప చిత్రబృందం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో దీనిపై స్పందిస్తారో లేదో వేచి చూడాలి. పుష్ప పార్ట్ వన్ లో విలన్గా ఫర్హాద్ ఫాసిల్ కనిపిస్తాడు. ఆఖరి ఫైట్ లో విలన్ చనిపోతాడని సమాచారం. దీంతో పార్టు టు లో కొత్త విలన్ కనిపిస్తాడు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి పుష్ప షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం తగ్గితే షూటింగ్ పున ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తున్నది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి వివరిస్తూ నేను నటనకు ఆస్కారం ఉన్న పల్లెటూరి అమ్మాయి పాత్ర లో కనిపిస్తానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. పుష్ప చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ పని చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button