
సినిమా కథ ఏదైన సరే తన పాత్రకు తగ్గట్టు తనకు తను మలుచుపోవడం అమీర్ ఖాన్ ప్రత్యేకత. అందుకేనేమో ఆయన్ను బాలీవుడ్ మి స్టర్ ఫర్ఫెక్ట్ అంటారు. తాజాగా అమీర్ ఖాన్ మరియు కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. వీరు ఇరువురు 15 ఏళ్ల పాటు తన దాంపత్యాన్ని సాగించారు. సడన్ గా ఈ విషయం తెలిపారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. కిరణ్ రావు అమీర్ ఖాన్ రెండో భార్య. వీరిరువురు మీడియాతో మాట్లాడుతూ ఇన్నేళ్లు వృత్తిపరంగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై నూతన జీవితం ప్రారంభిస్తామని ఇద్దరూ చెప్పుకొచ్చారు. కొడుకు ఆజాద్ బాధ్యతను వీరిరువురు చూసుకుంటారు. కిరణ్ రావు, లగాన్ చిత్రం సందర్భంగా పరిచయమై తరువాతి పరిణామాల నేపథ్యంలో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కిరణ్ రెండో వివాహం చేసుకున్నాడు అమీర్ ఖాన్.
One Comment