TECHNOLOGY

దీదీ ..డిశ్చార్జి.. ఇక స‌మ‌ర‌మేనా…

నందిగ్రాంలో ఏర్పడిన కాలి గాయంతో బాధపడుతూ పశ్చిమ బెంగాల్ సీ ఎం మమత బెనర్జీ బుధవారం ఎస్ఎస్ కేె ఎమ్ హాస్పిటల్ చేరగా, శుక్రవారం వైద్యులు డిశ్చార్జి చేశారు. వీల్ చైర్‌లో కూర్చోని క‌నిపించి‌న మ‌మ‌త, త‌న కాళీఘాట్ నివాసానికి చేరుకున్నారు. ఆరుగురు సభ్యుల వైద్య బృందం ఆమె ఆరోగ్య ప‌రిస్థితిని 48గంట‌‌ల పాటు ప‌ర్య‌వేక్షించింది. అయితే ఆమె ప‌దేప‌దే చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కు ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేసిన‌ట్లు ఆరుగురు స‌భ్యు‌ల్లో ఒక‌రు విలేక‌రుల‌కు తెలిపారు. మెడిక‌ల్ బోర్డు శుక్ర‌వారం మ‌మ‌త ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షించుకున్న‌ది. ఆమె వైద్యానికి బాగా స‌హ‌క‌రించారు. కాలికి త‌గిన గాయం కొంత వ‌ర‌కు ప‌ర్వాలేదు అని చెప్పారు. గురువారం నాడు మ‌మ‌తా బెన‌ర్జీ, రెండు మూడు రోజుల్లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటాన‌ని వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే. మెనిఫెస్టో ను ఈనెల 11కు రిలీజ్ చేయాల్సి ఉండగా మ‌మ‌త‌కు గాయాలు కావ‌డంతో 14కు వాయిదా వేశారు. ఈనెల 15న జ‌రిగే ఎన్నిక‌ల ప్ర‌చారంలో మ‌మ‌త పాల్గొన‌బోతున్నారు. ఈనెల 27న తొలిద‌శ పోలింగ్ జ‌రుగ‌నుంది.

Leave a Reply

Your email address will not be published.

Back to top button