TECHNOLOGY

‘హరిహర వీరమల్లు’ .. ఫ్యాన్స్ డబుల్ ఖుషి !

మహాశివరాత్రి పండగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకున్నారు. అయితే సినీహీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కు పండగ రోజు డబుల్ ఆనందాన్ని ఇచ్చారు. ఎలా అంటారా.. మీరే చదవండి..  నటసింహం బాలకృష్ణ తన ప్రతిష్టాత్మక 100వ సినిమా కోసం డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ ను ఎంచుకొని బంపర్ హిట్ అందుకున్నారు. చారిత్రాత్మక చిత్రంగా ‘గౌతమిపుత్ర శతకర్ణి’  తెరకెక్కింది. తథనంతరం థియేటర్లో ప్రదర్శించగా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ కు ఇంకాస్తా పేరును తెచ్చిపెట్టింది. అలాగే బాలీవుడ్ లో ‘మణికర్ణిక’ మూవీకి డైరెక్టర్ గా కూడా అవకాశం వచ్చిందనుకోండి.. అఫ్ కోర్స్ ఇతర కారణాలతో క్రిష్.. తప్పుకున్నారు…. అయితే పవన్ కళ్యాణ్ 27వ మూవీ డైరెక్టర్ క్రిష్ తో ఉంటుందని కొన్ని నెలల నుంచి టాలీవుడ్లో టాక్ వినిపిస్తున్నది. దీనిపై అభిమానులకు ఏదో మూలన సందేహం ఉన్నది. టాలీవుడ్ లో గాసిప్ లు కొత్త కాదుకదా.

ఎట్టకేలకు మహాశివరాత్రి రోజైన గురువారం పవన్ తన 27వ సినిమాను డైరెక్టర్ క్రిష్ తో చేస్తున్నట్లు స్పష్టమైంది. ఇద్దరి కాంబినేషన్ లో  ‘హరిహర వీరమల్లు‘ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ విడుదలైంది. ఇందులో కళ్యాణ్.. లుక్, టైటిల్ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ సూపర్బ్ గా ఉన్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. నాలుగు గంటల్లోపే ఒక మిలియన్(పది లక్షల) వ్యూస్ కూడా వచ్చాయని క్రిష్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్.. హీరోయిన్గా, నిర్మాతగా ఏఎం రత్నం, దయాకర్ రావు, బాణీలు ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రఫి జ్ఞాన్ వేల్, మాటలు సాయి మాధవ్ బుర్ర అందిస్తున్నారు. ఈ చిత్రం 2022 జనవరిలో విడుదల కానుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ఏప్రిల్ 9న రిలీజ్ కు సిద్ధంగా ఉన్నది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button