స్టార్ డైరెక్టర్ కు సూపర్ స్టార్ బర్త్ డే విషెస్

డైరెక్టర్ కొరటాల శివ, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో విచ్చేసిన శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే కొరటాల శివ నేడు(మంగళవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ట్విట్టర్ వేదికగా మహేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో కలకాలం వర్థిల్లాలి అని కోరుకున్నాడు మహేశ్. ఆయన ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్నారు. కొరటాల శివ, మెగాస్టార్ తో ఆచార్య సినిమా చేస్తుండగా, అది దాదాపుగా పూర్తి కావచ్చిందని సమాచారం. బహుశా ఆగస్టులో రిలీజ్ అవుతుందో లేదో వేచిచూడాల్సిందే. ఇప్పటికే రిలీజైన ఫైట్ సీన్ కు, లాహే సాంగ్ కు సినీప్రేక్షకుల నుంచి అనూహ్యస్పందన వచ్చింది. కొరటాల శివ మరిన్నీ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆల్ క్యాష్ వే ప్రతినిధుల బృందం కోరుకుంటున్నది.