TECHNOLOGY

సూర్య 40వ చిత్రం.. నేషనల్ అవార్డు గ్రహీత డైరెక్టర్ !

కోలీవుడ్ ప్రముఖ హీరో సూర్య తన 40వ చిత్రంపై ఒక తాజా సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత, డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థ నిర్మిస్తోంది. హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటించనుంది.  తమిళనాడులో సంచలనం కలిగించిన పొల్లంచి గ్యాంగ్ రేప్ కేసులోని పలు సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ గా మూవీ ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మహిళలను, యువతులను వేధించే దుండగులను వెంటాడే ఒక పాత్రలో కనిపించబోతున్నాడు సూర్య. ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన యముడు, ఎస్ 2, ఎస్ 3 సీక్వెల్స్ తో వరుస హిట్లను అందుకున్నాడు కోలివుడ్ స్టార్. మరి సూర్య నటించబోయే చిత్రం ఎలా ఉంటుందో చూడాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button