TECHNOLOGY

సారంగ దరియా పాటకు… 50 లక్షల వ్యూస్

దర్శకుడు శేకర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాలను తెరకెక్కించడంలో ఘనాపాటి.  డాలర్ డ్రీమ్ మూవీతో డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టారు. అలా ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఆవకాయ్ బిర్యాని,  లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా చిత్రాలకు డైరెక్షన్ చేశారు. తాజాగా లవ్స్టోరీ చిత్రం. ఈ చిత్రానికి రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన పాట.. సారంగ దరియా .. వివాదాస్పదమైంది. జానపాద గాయని కోమల ఆ పాట తనదేనని మీడియా, లైవ్ ప్రోగ్రాముల్లో బహిరంగంగా చెప్పింది. వివాదం తారాస్థాయికి చేరుతున్న క్రమంలో శేకర్ కమ్ముల, కోమలకు డబ్బులతోపాటు తన లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఆడియో వేడుకలో పాడిస్తామని చెప్పడంతో ప్రస్తుతానికి సద్దుమణిగింది.

అయితే సారంగ దరియా పాటకు.. హీరోయిన్ సాయి పల్లవి డ్యాన్స్ కూడా 50 లక్షల వ్యూస్ రావడానికి కారణం అని నిస్సందేహంగా చెప్పొచ్చు.   వివాదస్పదం కూడా పాట హిట్ కు దోహదపడిందని కొందరు సినీ అభిమానులు అంటున్నారు.  ఏదీ ఏమైనప్పటికీ 50 లక్షల వ్యూస్ రావడం మాములు విషయం కాదుకదా.. ఆల్ టెక్ క్యాస్ వే  వెబ్ సైట్ .. తరపున లవ్ స్టోరీ టీంకు ..ఆల్ ది బెస్ట్.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button