TECHNOLOGY

సర్కారు వారి పాట మూవీ రిలీజ్ డేట్ తెలిసిందోచ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్ లోని కొంత పార్టును దుబాయిలో మేకర్స్.. పూర్తి చేసుకుని ఒక నెల క్రితం వచ్చారు.  ఈ కాస్తా దొరికిన విరామ సమయంలో తర్వాతి షూట్ ఎక్కడ ప్రారంభించాలని చిత్ర యూనిట్ చర్చలపై చర్చలు జరుపుతున్నది. ముందుగా కొంత భాగాన్ని అమెరికాలో చిత్రీకరించాలని తలచింది. కానీ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరలా దుబాయికే వెళ్లనున్నట్లు దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. బహుశా ఈనెల 22న షూట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత హైదరాబాద్, గోవాల్లోనూ జరుపుకోనుంది. ఈ చిత్రం 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తున్నది. సర్కారు వారి చిత్రానికి డైరెక్టర్ పరుశురాం. హీరోయిన్ కీర్తి సురేశ్. మైత్రీ మూవీస్ ఎంటర్ టైన్ మెంట్, 14 రిల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా చిత్రాన్ని సమర్పణ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button