TECHNOLOGY

వెస్టిండిస్ vs శ్రీలంక టీ20 సిరీస్ : ఉత్కంఠ భరిత మ్యాచ్లో కరేబియన్లదే గెలుపు

వెస్టిండిస్ వర్సెస్ శ్రీలంక మూడు టీ20 సిరీస్లో భాగంగా ఉత్కంఠగా సాగిన 3వ టీ20 మ్యాచ్లో కరేబియన్( వెస్టిండిస్) జట్టు మ్యాచ్ గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ విజయంలో కరేబియన్ ఆటగాళ్లు అలెన్, హోల్డర్ కీలక పాత్ర పోషించారు. దీంతో జట్టు మూడు వికెట్లతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయుల(శ్రీలంక) జట్టు 20 ఓవర్లలో 131/4 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కరేబియన్ జట్టు ఓపెనర్లు సిమాన్స్, లూయిస్ జోడి బ్యాటింగ్ ధాటికి 4.4 ఓవర్ల లో 37 పరుగులు వచ్చాయి. 37 పరుగుల వద్ద శ్రీలంక బౌలర్  వనిడు హసరనగ బౌలింగ్ లో లూయిస్( 21) ఎల్బీగా ఔటై వెనుదిరిగాడు. అతడి బౌలింగ్ లోనే సిమాన్స్, డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరారు. ఇక మరో బౌలర్ సన్ దకన్, మిడిల్ ఓవర్లలో కట్టు దిట్టమైన బౌలింగ్ చేసి, కరేబియన్ జట్టును ఇబ్బందికి గురి చేశాడు. హార్డ్ హిట్టర్లు క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్ లను ఔట్ చేసి మ్యాచ్ను లంకవైపునకు తిప్పాడు. మొత్తంగా శ్రీలంకేయులు ఏడు వికెట్లను పడగొట్టారు. అయితే ఒక వైపు వికెట్లు పండుతుండడంతో విజయం రెండు వైపుల దోబూచులాడింది. మ్యాచ్ 19వ ఓవర్కు చేరడంతో అందరిలోనూ ఉత్కంఠ. అప్పటికే క్రీజులో ఉన్న టైలండర్ అలెన్, ఆల్ రౌండర్ హోల్డర్ 19 వ ఓవర్లో చివరి బంతికి హోల్డర్ .. సిక్స్ కొట్టడంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో శ్రీలంకపై కరేబియన్ జట్టుదే పైచేయిగా నిలిచింది.

శ్రీలంక జట్టు స్కోర్ : 131/4 వెస్టిండిస్ జట్టు స్కోర్ : 137/ 7

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button