TECHNOLOGY
వెంకటేశ్ కూతురుకి ఇన్ స్టాగ్రామ్ లో లక్షమంది ఫాలోవర్స్.. ఇక పైసా వసూల్ ..

విక్టరి వెంకటేశ్ పెద్ద కూతురు అస్రిత దగ్గుబాటి ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ఫినిటి ప్లట్టర్స్ పేజ్ నడుపుతున్నది. అందులో వంటకాలు రకరకాల రెసిపీలకు చెందిన వీడియోలను పోస్టు చేస్తున్నది. మొత్తంగా 377 పోస్టులు చేయగా, ఆమెకు లక్షమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక నుంచి ఆమె ఏ పోస్టు చేసినా..ఆ పోస్టు తాలూకు డబ్బులు సంపాదించనున్నది. అస్రిత, వినాయక రెడ్డిని వివాహమాడింది. ప్రస్తుతం ఫారేన్లో ఉంటోంది. ఇటీవల విరాట్ కోహ్లి, ప్రియాంక చోప్రా లాంటి స్టార్ లు ఒక్కో పోస్టుకు వరుసగా రూ. 5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు సంపాదిస్తున్న విషయం విదితమే.