TECHNOLOGY

వకీల్ సాబ్ చిత్రంపై మహేశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు?

వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హిట్ కావడం ఒక ఎత్తయితే, పవన్ నటనకు ఫిదా అయి కొందరు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసిస్తూ ట్విట్లు చేస్తున్నారు. వారిలో తాజాగా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ కూడా చేరారు. వకీల్ సాబ్ చిత్రంలో పవర్ స్టార్ పేర్ఫామెన్స్ ఇరగదీశారని ట్విట్టర్ లో పోస్టు చేశారు. సూపర్ స్టార్ ఇలా ట్విట్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ ఖుషిలో ఉన్నారు. అలాగే షాక్ కు గురయ్యారు. ఇంకా ఈ చిత్రంలో  ప్రకాశ్ రాజ్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు మహేశ్. అలాగే నటీమణులు నివేదా ధామస్, అంజలి, అనన్య నటన హృదయానికి హత్తుకునేలా ఉందన్నారు.  థమన్ మ్యూజిక్ వినసొంపుగా ఉందని పొగిడారు. సర్కారు వారి పాట చిత్రానికి కూడా థమనే బాణీలను అందిస్తున్నాడనే విషయం విదితమే కదా. వకీల్ సాబ్ చిత్ర బృందానికి మహేశ్ బాబు అభినందనలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button