TECHNOLOGY

లుకేమియాతో బాధపడుతున్న అభిమానిని కలిసిన పవర్ స్టార్

రూ. 5లక్షల ఆర్థిక సాయం

లుకేమియాతో బాధపడుతున్న తన అభిమానిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు. కృష్ణా జిల్లా లింగాల గ్రామానికి చెందిన అభిమాని భార్గవ, క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.   ఈ విషయం తెలుసుకున్న పవన్ , భార్గవ అతడి కుటుంబీకులను పరామర్శించి, కొంత సమయాన్ని వారితో గడిపారు. భార్గవకు వెండి గణేషుడిని అందించి,  ఆపై రూ.5 లక్షలను వైద్యచికిత్స కోసం అందించారు. భార్గవ దృఢసంకల్పంతో ఉండాలని పవన్ తెలిపారు.  సాధారణంగా పవన్ తన అభిమానులకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారని అందిరికీ తెలిసిన విషయమే.  పవన్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది.  ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. మగువ, సత్యమేవ జయతే … పాటలకు అభిమానులు, ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.  ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్. మ్యూజిక్ను ఎస్. థమన్.   హిందీ చిత్రం పింక్ కు ఇది రిమేక్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button