TECHNOLOGY

రెండో వన్డేలో అదరగొట్టిన టీమిండియా

రాణించిన కోహ్లి, కిషన్

16న జరిగే మూడో టీ20 ఇరుజట్లకు కీలకం

నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా రెండో టీ20లో భారత్ జట్టు విజయం సాధించింది. దీంతో ఐదు టీ 20ల సమరంలో రెండు పూర్తయ్యే నాటికి ఇరుజట్లు 1‌-1 ఒక్కో మ్యాచ్ను గెలుచుకున్నాయి. దీంతో ఈనెల 16న జరిగే టీ20 రెండుజట్లకు కీలకం కానుంది. అయితే మోదీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ 20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ టీం 20 ఓవర్లలో 164/6 పరుగులు చేసింది. సమాధానంగా బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలో రాహుల్ (0) డకౌట్ అయ్యారు. అయినా మరో ఓపెనర్ కిషన్, కెప్టెన్ కింగ్ కోహ్లి రన్ రేట్ పడిపోకుండా పరుగులు వేగంగా సాధించారు.  వీరిద్దరి భాగస్వామ్యంతో 9.2 ఓవర్లలో 92 పరుగులు రాబట్టారు. కిషన్ (56 పరుగులు, 32 బంతులు, సిక్స్లు 4, ఫోర్లు 5 ), రషీద్ బౌలింగ్ లో రెండో వికెట్గా వెనుదిరిగాడు.

కింగ్ కోహ్లి స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ఎక్కువగా కిషన్ బ్యాటింగ్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చాడు. కిషన్ ఔట్ అయ్యాక టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా వచ్చిన పంత్ కొంత సేపు గ్రీజులో ఉండి అలరించాడు. అనవసర షాట్ కు యత్నించిన పంత్ ( 26 పరుగులు 13 బంతులు, సిక్స్ లు 2, ఫోర్లు 2) క్రిస్ జోర్దాన్ బౌలింగ్ లో బెయిర్ స్ర్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 130 పరుగులు. ఇంకా విజయానికి 35 పరుగుల దూరంలో ఉన్న సమయంలో కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ జట్టును విజయతీరాలకు చేర్చారు. 17.4, 17.5 వరుస బంతుల్లో విజయానికి కావలసిన పరుగులను కోహ్లి(73 పరుగులు 43 బంతులు, సిక్స్లు 3, ఫోర్లు 5)  సాధించాడు. దీంతో మరో 2.1 ఓవర్లు మిగిలి ఉండగానే విజయకేతనం ఎగరవేసింది టీం ఇండియా. ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కిషన్ నిలిచాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button