రూ.2500 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కి పడింది. కనీవినీ ఎరుగని రీతిలో కోట్లలో విలువ చేసే హెరాయిన్ పట్టివేత. 354 కేజీల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలువ రూ.2,500 కోట్లు ఉంటుందని వెల్లడించిన ఢిల్లీ స్పెషల్ కమిషనర్ నీరజ్ ఠాకూర్. ఫరీదాబాద్ ప్రాంతంలోని ఒక ఇంటిలో నిల్వలను గుర్తించారు. ఇది అంతర్జాతీయ రాకెట్ ముఠా పనేనని తెలుస్తోంది. అప్ఘానిస్థాన్, యూరప్, భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వాటి స్థావరాలు ఉన్నాయని కమిషనర్ స్పష్టంచేశారు. ఇరాన్ కు చెందిన ఛాబర్ పోర్టు నుంచి మహారాష్ట్ర ముంబయి వయా జవహర్ లాల్ పోర్టు వద్దకు హెరాయిన్ ను చేరుస్తున్నారు. డ్రగ్స్ ను మధ్యప్రదేశ్ లోని శివ్ పూరికి సమీపంలో ఉన్న ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. హెరాయిన్ తయారు చేయడానికి అఫ్ఘానిస్తాన్ కు చెందిన ఎక్స్ పర్ట్స్ సాయం తీసుకుంటారు. తర్వాత వాటిని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ ఇతర రాష్ట్రాల్లో విక్రయాలు జరుపుతుంటారు. అసలు సూత్రదారి నవ్ ప్రీత్ సింగ్ , పోర్చుగల్ దేశం నుంచి కార్యకలాపాలు జరుపుతుంటాడు. ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇటీవల 283 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకోగా విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని చెబుతున్నారు.