TECHNOLOGY

రాజస్థాన్ మాజీ గవర్నర్ అంశుమాన్ సింగ్ కన్నుమూత

రాజస్థాన్ మాజీ గవర్నర్, అలహాబాద్ హైకోర్టు మాజీ జస్టిస్ అంశుమాన్ సింగ్ (86) సోమవారం కన్నుమూశారు. అత్యావసర స్థితిలో ఆయన్ను మెడిజిన్(సీసీఎం)లో చేర్పించారు. ఆ సమయంలో ఆయన శరీర అవయవాలు పనిచేయడం లేదు. జనవరిలో సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. దీంతో ఆయనను పీజీఐ కోవిడ్ ఆస్పత్రిలో చేర్పించారు. 25 రోజుల క్రితం కరోనా నెగిటివ్ గా నిర్ధారణ కావడంతో సీసీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నది. సోమవారం ఉదయం కన్నుమూశారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాలకు గవర్నర్‌గా పనిచేశారు. 28 ఏళ్లపాటు ప్రయాగ్రాజ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1984 లో ప్రయాగ్రాజ్ హైకోర్టు న్యాయమూర్తిగా తరువాత రాజస్థాన్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేశారు.

Below Article Content Ad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker