TECHNOLOGY

రాజమౌళి ట్విస్ట్ లో.. రాజసం ఉట్టిపడనుందా?

అలియా భట్ లుక్ 15న విడుదల చేస్తున్న జక్కన్న

దర్శక ధీరుడు జక్కన్న అదేనండి మన రాజమౌళి డైరెక్టు చేస్తున్న చిత్రం త్రిపుల్ ఆర్ అప్డేట్ గురించి చిత్ర పరిశ్రమతోపాటు అభిమానులందరూ ఎప్పడెప్పుడూ అని ఎదురుచూస్తున్నారు. మరి జక్కన్న వారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి త్రిపుల్  ఆర్ నుంచి తాజా ఆప్డేట్ ఇచ్చేశాడు.  త్రిపుల్ ఆర్ లో కొమురం భీంగా జూనియర్ ఎన్టీ ఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే వారి పాత్రకు సంబంధించిన వాయిస్ ఓవర్ తో టీజర్లు విడుదలై సంచలనం కల్గించిన విషయం విదితమే. తాజాగా జక్కన్న త్రిపుల్ ఆర్ లో బాలీవుడ్ నటి అలియా భట్, చరణ్కు జోడిగా నటిస్తున్నదన్నది తెలిసిందే.

అయితే ఆమె పాత్ర పేరు సీత అని, అలియా భట్ ఫస్ట్ లుక్ కోసం మార్చి 15న ఉదయం 11 గంటలకు  వరకు వేచిచూడాలని దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యాన్స్ కు ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు, ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. బాహుబలి, బాహుబలి2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మల్టీస్టారర్ చిత్రం కావడం, పైగా అన్ని భాషల్లో సినిమా విడుదల అవుతున్నది. డీవీవీ దానయ్య ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బడ్జెట్ రూ.400 కోట్లు. ఇంకా చిత్రంలో  ఒలివియా మోర్రీస్, బాలీవుడ్ నటుడు అజేయ్ దేవగన్, క్రాక్ చిత్ర విలన్ సముద్రఖని, రాయ్ స్టీవెన్ సన్, అలీసన్ దూడే, ఛత్రపతి శేకర్, శ్రియా శరణ్ తదితరులు నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబరు 13న రిలీజ్ కానుంది. బాణీలను కీరవాణి సమకూరుస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button