TECHNOLOGY

ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చిట్ చాట్ రేపు

కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ 19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నం 12.3‌0 గంటలకు భేటి కానున్నట్లు పీఎంవో ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో రోజు పది వేల కరోనా కేసులు నమోదవుతున్నారని నివేదికలు పేర్కొంటుండగా, ఒక్క మంగళవారం రోజు 26291 నూతన కేసులు నమోదయ్యాయి. 85 రోజుల తర్వాత ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 1,58, 525కు చేరగా, 118 మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకు 2,19, 262 యాక్టివ్ కేసులున్నాయి,  రికవరి రేటు 96.68 శాతానికి తగ్గింది.  ఐదు రాష్ట్రాలు మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడుల్లో 78. 41 శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  ఒక్క మహారాష్ట్రలో 63 శాతం కేసులు నమోదు కావడం గమనార్హంగా ఉందని తెలిపింది. అయితే మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, తమిళనాడుల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తించామని వెల్లడించింది. అయితే పీఎం మోదీ గత జనవరిలో వ్యాక్సిన్ బయటికి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిన విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button