TECHNOLOGY

బ్యాట్స్‌మెన్ వైఫ‌ల్యం.. తొలి టీ20లో భార‌త్ ఓటమి

రెండో టీ 20 ఆదివారం నాడు

ఇంగ్లాండ్ వ‌ర్సెస్ ఇండియా ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్ర‌వారం మొతేరా స్టేడియంలో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భార‌త్ ఓట‌మిని చ‌విచూసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా నిర్ణిత 20 ఓవ‌ర్లులో 124 ప‌రుగులు చేసింది. బ్యాట్ మెన్స్‌లో శ్రేయా‌స్ అయ్య‌ర్(67ప‌రుగులు 48 బంతుల్లో ) ఒక్క‌డే ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఎదుర్కొని నిల‌బ‌డ్డాడు. మిగ‌తా బ్యాట్స్‌మెన్లు విఫ‌లం కావ‌డంతో ర‌న్‌రేట్ త‌గ్గిపోయింది. కింగ్ కోహ్లి డ‌కౌట్ అయ్యాడు. టీం ఇండియా విసిరిన 124 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్ 15.3 ఓవ‌ర్ల‌లోనే 130/2 ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా జోఫ్రా ఆర్చ‌ర్ నిలిచాడు. నాలుగు మ్యాచ్ సిరీస్ లో త‌ర్వాతి రెండో టీ 20మ్యాచ్ మెతేరా స్టేడియంలోనే ఆదివారం జ‌రగ‌నుంది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆర్చ‌ర్‌.. ఆయ‌న మాట‌లు..
డాట్ బాల్ కోసం ప‌వ‌ర్ ప్లేలో య‌త్నిస్తే బాల్ బౌన్స్ అయి వికెట్లు ద‌క్కాయి. బౌండ‌రి పెద్ద‌ది కావ‌డంతో షార్ట్ బాల్ వేస్తే మంచిద‌నిపించింది. అలా వికెట్లు ల‌భించాయి. అయితే ఐపీఎల్ లీగ్ ఇంగ్లాండ్ లో లేదు, ఉంటే క‌నుక చాలామంది ప్ర‌పంచ‌స్థాయి బౌల‌ర్లు సిద్ధ‌మ‌య్యేవారు.

ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ మాట‌లు..
బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ సామ‌ర్థ్యం ఏమిటో తెలుసు. బౌల్ ను లెన్త్‌తో పాటు వికెట్ల‌కు విస‌డంలో విజ‌యం సాధించాడు. ఇంకా మా బ్యాటింగ్, బౌలింగ్ యూనిట్ల లోని స‌భ్యులు జ‌ట్టులో చోటు కోసం పోటీప‌డుతున్నారు.

భార‌త్ కెప్టెన్ కోహ్లి వ్యాఖ్య‌లు..
పిచ్ ను స‌రిగా అంచ‌నా వేయ‌లేక‌పోయాం. రాంగ్ షాట్‌ల‌కు పోయి వికెట్ల‌ను చేజార్చుకున్నాం. మేము మా లోపాల‌ను స‌రిచేసుకుంటాం. త‌ర్వాత మ్యాచ్ లో ప్ర‌ణాళిక‌లు ర‌చించుకొని, పుంజుకునేందుకు య‌త్నిస్తాం. ఇంగ్లాండ్ ను తేలిక‌గా తీసుకోబోలేము. త్వ‌ర‌లో జ‌రిగే టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ కు ముందు కేవ‌లం ఐదు టీ20 మ్యాచ్‌లే ఆడుతున్నాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button