TECHNOLOGY
బాలీవుడ్ లో రిమెక్ కానున్న జనతా గ్యారేజీ

కండల వీరుడు సల్మాన్ ఖాన్ టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రిమేక్ లో నటించబోతున్నాడా? బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రంపై మనసు పడ్డాడా? విభిన్న కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సల్మాన్ కు ఆ మూవీ అంత బాగా నచ్చిందా? ఇక అసలు విషయానికి వద్దాం.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ కాంబోలో 2016లో వచ్చిన జనతా గ్యారేజి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కథ, కథనం, స్ర్కీన్ ప్లే, నటీనటుల పెర్ఫామెన్స్ కు నూటికి నూరు మార్కులను సినీ ప్రేక్షకులు వేశారు. నేను పక్కా లోకల్ అనే సాంగ్ కు మాస్ క్లాస్ ఆడియన్స్ ఉర్రూతలూగారు. సల్మాన్ ఖాన్ నటించబోయే ఈ హిందీ రిమెక్ జనతా గ్యారేజి 2023లో సెట్స్ పైకి వెళ్లనుంది.
