TECHNOLOGY

తాడిపత్రిలో వీడిన ఉత్కంఠ

మున్సిపల్ చైర్ పర్సన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నిక

 అనంతపురం తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీకి లైన్ క్లియర్ అయ్యింది. మున్సిపాల్టీలో కీలకంగా మారిన ఎక్స్ అఫీషియో ఓట్లపై మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు ఎక్స్ అఫీషియో ఓట్లను తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వారిలో ముగ్గురు వైసీపీ, ఒక టీడీపీ ఎమ్మెల్సీ దరఖాస్తులున్నాయి. ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసిన నలుగురు ఎమ్మెల్సీల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీలు గోపాల్ రెడ్డి, శమంతకమణి, మహమ్మద్ ఇక్బాల్ దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురైనట్లు కమిషనర్ తెలిపారు. ఎలక్షన్ గైడ్ లెన్స్ ప్రకారం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఎక్కడైతే ఓటుహక్కు నమోదవుతుందై ఉంటుందో అక్కడే ఎక్స్ అఫీషియో ఓటుకు అర్హులవుతారని చెప్పారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్థానం కైవసం చేసుకోవాలంటే కావాల్సిన ఓట్లు 19. సీపీఐ, ఇండిపెండెంట్ తో కలిపి టీడీపీ బలం 20, అక్స్ అఫీషియోతో కలిపి వైసీపీ బలం18.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button